అందం, అభినయం రెండూ కలిసి ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. నేను శైలజ మూవీతో హీరోయిన్గా తెలుగులోకి పరిచయమైన కీర్తి సురేష్.. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. మహానటి సినిమాకు కీర్తి సురేష్ కి జాతీయ అవార్డు కూడా వచ్చింది. అయితే కీర్తి ఒకప్పుడు స్పెయిన్ కి వెళ్లిన జ్ఞాపకాలను తన ఫోటో ద్వారా గుర్తుచేసుకుంది. వెనకాల సూర్యుడుతో కీర్తి సురేష్ తో దిగిన ఈ ఫోటో చూడటానికి చాలా బాగుంది. ఈ ఫోటో తన జ్ఞాపకల్లో ఎప్పటికి ఉంటుంది అని ఆమె క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోలో కీర్తి వైట్ డ్రెస్ లో అందంగా కనిపించింది. ఇక కీర్తి ప్రస్తుతం నితిన్ తో కలిసి రంగ్ దే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఒక పాట ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కీర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకాబోతుంది. గీత గోవిందం సినిమాతో మంచి పెరు తెచ్చుకున్న పరుశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.