



మహానటి చిత్రంతో కీర్తి సురేష్ రేంజ్ టాలీవుడ్ లో బాగా పెరిగింది. ఆ చిత్రంలో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే మహానటి తర్వాత కీర్తి తన ప్రిఫరెన్స్ లను మార్చుకుంది. ఎక్కువగా విమెన్ సెంట్రిక్ రోల్స్ కు ఎస్ చెబుతూ వచ్చింది. అయితే అవి ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్ గానే నిలిచాయి. ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు ఓ.టి.టి మీడియాలో రిలీజై నెగటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ఇక కీర్తి మళ్ళీ కమర్షియల్ కథలకు ఎస్ చెబుతోంది. నితిన్ సరసన రంగ్ దే చిత్రాన్ని చేస్తోన్న కీర్తి, సూపర్ స్టార్ సినిమాలో అవకాశం పట్టేసింది. ఇక రంగ్ దే విషయానికొస్తే ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోన్న విషయం. కీర్తి సురేష్ ఈ మధ్య తన దర్శకుడు, హీరోను ఫన్నీగా కొడుతున్న వీడియో బాగా వైరల్ అయింది. కీర్తి సురేష్ రీసెంట్ గా పోస్ట్ చేసిన ఈ ఫోటో చాల అట్ట్రాక్టీవ్ గా ఉంది. కీర్తి లుక్ క్యాజువల్ గానే ఉంది కానీ వెనకాల బ్యాక్ గ్రౌండ్ ఆకట్టుకుంటోంది.