టాలీవుడ్ టాప్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఇటీవలే ముంబైకు చెందిన బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లును వివాహమాడిన విషయం తెల్సిందే. ఆ తర్వాత మాల్దీవ్స్ కు హనీమూన్ కు వెళ్ళిన ఈ కపుల్ ఈ మధ్యనే తిరిగివచ్చారు. గత కొన్ని రోజులుగా కాజల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కిచ్డ్ అంటూ పోస్ట్ లు పెడుతోన్న విషయం తెల్సిందే. దీనికి సంబంధించిన వివరాలు ఈ దంపతులు ఇప్పుడు బయట పెట్టారు. కిచ్డ్ పేరిట వీరిద్దరూ కలిసి ఒక హోమ్ డెకార్ లేబుల్ ను ప్రారంభించారు. ఈ బ్రాండ్ పేరిట మనం ఇంటిని ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అని చూసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ కిచ్డ్ బ్రాండ్ డీసెర్న్ లివింగ్ లో అందుబాటులో ఉన్నాయి. మొదటి ప్రయత్నంగా కుషన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తోంది కాజల్ అగర్వాల్. ఇటీవలే షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. ఇక కమల్ హాసన్ - శంకర్ ల ఇండియన్ 2 లో కూడా ఈ భామ ఒక మంచి పాత్రను పోషిస్తోంది.