నటి కాజల్ అగర్వాల్ ఇటీవలే వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది కాజల్. ఆ తర్వాత ఇద్దరూ మాల్దీవ్స్ కు వెళ్ళి హనీమూన్ ఎంజాయ్ చేసారు. ఇటీవలే కాజల్ తిరిగి తన ఫోకస్ ను సినిమాలపై పెట్టింది. ఇక ఈరోజు కాజల్ అగర్వాల్ తండ్రి వినయ్ అగర్వాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కాజల్ ఎమోషనల్ బర్త్ డే విషెస్ తెలిపింది. "ఒక ఫోటో వెయ్యి మాటలు మాట్లాడుతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న" అని కాజల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం కాజల్ వరస సినిమాలతో బిజీ కానుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంతకు ముందు ఖైదీ నెం 150లో కూడా కాజల్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఇక కమల్ హాసన్ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 లో కూడా కాజల్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. రీసెంట్ గా తమిళ్ లో ఒక హారర్ థ్రిల్లర్ ను కూడా ఓకే చేసిన విషయం తెల్సిందే.