ముంబై సాగా తో బాలివుడ్ లో పాగా వేస్తుందా


‘క్యుఁ హో గయా నా’ సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమైంది కాజల్. వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన ఈ చిత్రం 2004లో విడుదలైంది. ఆ చిత్రంలో ఆమె ఐష్ చెల్లెలి పాత్రను పోషించింది. తోలి సినిమా హిందీ చిత్రమే అయినా ఆమె 2007లో ‘లక్ష్మి కల్యాణం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత వచ్చిన ‘చందమామ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటూ, ఆర్య-2, మగధీర లాంటి చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది.


కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా బిజీ అయ్యింది కాజల్. హిందీ ఆఫర్లు వచ్చినప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయింది. హిందీ సినిమాతోనే తెరంగేట్రం చేసినా అక్కడ మాత్రం బిజీ కాలేకపోయింది. అజేయ్ దేవగన్ హీరోగా నటించిన సింగం, అక్షయ్ కుమార్, మనోజ్ బాజ్పేయ్ లు నటించిన స్పెషల్ 26 చిత్రాల్లో నటించిన కాజల్ చివరిగా దో లఫ్జోంకి కహాని లో నటించింది. ఆ తర్వాత పెద్దగా హిందీ వైపు చూసింది లేదు.


అయితే ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ హిందీ చిత్రంతో ముందుకు రానుంది కాజల్. జాన్ అబ్రహమ్, ఇమ్రాన్ హాష్మి, కాజల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ముంబై సాగా. ఈ చిత్రంలో జాన్ గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తుండగా ఇమ్రాన్ పోలిస్ పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ జాన్ కు జోడిగా నటించింది. ఇది వరకు తెలుగులో ఆమె చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో పోషించిన ట్రెడిషనల్ పాత్రను పోలి ఉంది ఈ చిత్రంలో ఆమె పాత్ర.

ఈ చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహించగా భూషణ్ కుమార్, కిషన్ కుమార్, అనురాధ గుప్తా, సంగీత అహిర్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో కాజల్ బాలివుడ్ లో బిజీ అవుతుందేమో చూడాలి మరి. మార్చి 19న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.