ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన హిరోయిన్ ఇలియానా. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లను మనం చూసుంటాం అయితే నడుము సన్న నాగరాజా అన్నట్టు తన సన్నని నడుముతో కైపెక్కించే అందాలతో తెలుగు యువతను ఇలియానా కవ్వించినంతగా ఏ హీరోయిన్ ఆకట్టుకోలేదనే చెప్పాలి. అయితే అలాంటి ఇలియానాకి మొదట్లో సినిమాలంటేనే ఇష్టముండేది కాదట. కానీ తన ప్రొఫెషన్ మోడలింగ్ అవ్వడంతో ఒక యాడ్ లో గోవా బ్యూటీ ఇలియానాని చూసిన వై.వి.ఎస్ చౌదరి ఆమెకి దేవదాసు సినిమాలో హీరోయిన్ గా అవకాశమిచ్చారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఇలియానాకి వరుసగా అవకాశాలు రావడం మొదలైంది. పూరి దర్శకత్వంలో మహేష్ తో పోకిరి సినిమాలో నటించే అవకాశం రావడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ తర్వాత ఫుల్ బిజి అయిపోయింది. పోకిరి సినిమా తర్వాత ఇలియానా ఏ రెంజ్ కి వెళ్ళిందో అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత రష్యన్ పోటోగ్రాఫర్ తో కొన్ని రోజులు ప్రేమ ప్రయాణం చేసింది. బాలీవుడ్ లోకి ఇలియానా వెళ్ళాక సినిమాలు తగ్గాయి. మళ్ళీ అమర్ అక్భర్ ఆంటోని సినిమాతో తెలగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ లో తన గ్లామర్ ఫోటోస్ పోస్ట్ చేస్తు అందర్ని అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఇలియానా ఒక ఫోటోని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఇలియానా డిఫరెంట్ లుక్ తో అదరగొట్టింది. ఈ ఫోటో పెడుతూ లైఫ్ లో డౌన్ అవుతుండడం కామన్ వాటిని బయటికి వచ్చి అడుగు వేయాలి అంటూ చెప్పుకొచ్చింది.