

దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హన్సిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులను అలరించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అలాగే కోలీవుడ్ లో కూడా తన అందంతో నటనతో అగ్ర కథానాయికగా ఎదిగింది.ఇక ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నలుపు రంగు డ్రెస్ లో అందంగా ఫొటోస్ ని పోస్ట్ చేసారు.ఈ ఫొటోస్ ని చూసి ఆమె ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు. అందమైన చుడిదర్ డ్రెస్ లో హన్సిక ఇంకా అందంగా కనిపించింది.
హన్సిక ని స్టైల్ గా బిగ్ బారో స్టూడియో వాళ్ళు తయారు చేశారు . తన వేసుకున్న జూలరి నిషీటల్ జేవీరి కంపెనీ డిజైన్ చేసింది.ఆమె ఇంట్లో జరిగే ఫంక్షన్ కోసం హన్సిక ఈ దుస్తులని ధరించింది.ఇక హీరోయిన్గా హన్సిక 50వ సినిమా మైలు రాయిని అందుకున్నారు. ఆమె 50వ సినిమా ఓ క్రేజీ లేడీ ఓరియంటెడ్ కథ . ‘మహా’ టైటిల్‌తో ఈ సినిమాకు యుఆర్ జమీల్ దర్శకత్వం వహించారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాలో హన్సిక పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయి. అలాగే అతిథి పాత్రలో ప్రముఖ నటుడు శింబు మెరవనున్నారు.ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో శింబు కనిపిస్తారు. కోవిడ్ తర్వాత ఇటీవలే సినిమా చిత్రీకరణ ప్రారంభించి, పూర్తి చేశారు .