దేశముదురు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన పాల బుగ్గల సుందరి హన్సిక మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అక్కడి నుండి హన్సిక వెనుతిరిగి చూసింది లేదు. మొదట తెలుగులో వరస అవకాశాలతో పాటు విజయాలను కూడా అందుకున్న హన్సిక క్రమంగా తమిళ సినెమాలపైకి తన ఫోకస్ మళ్లించింది. కోలీవుడ్ లో ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. చాలా తక్కువ కాలంలోనే హన్సిక అక్కడ స్టార్ స్టేటస్ ను సంపాదించింది. గతేడాది తెనాలి రామకృష్ణ బి.ఎ బి.ఎల్ అనే చిత్రంతో హన్సిక మళ్ళీ తెలుగులో నటించింది. తమిళంలో మహా అనే చిత్రంలో హన్సిక నటిస్తోంది. ఇదిలా ఉంటే ఆమె రీసెంట్ గా పోస్ట్ చేస్తోన్న ఫోటోలను బట్టి ఆమె తనకు బాగా దగ్గరైన వారి పెళ్ళిలో ఎంజాయ్ చేస్తోన్న విషయం అర్ధమవుతోంది. అయితే ఆ వివరాలు ఆమె తెలియపర్చలేదు కానీ తన ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఆమె ఈ పెళ్ళి తాలూకు ఫోటోలను షేర్ చేస్తోంది. రీసెంట్ గా హన్సిక బారాత్ కు తయారయ్యా అంటూ ఫొటోస్ ను షేర్ చేసింది. ఈ రాయల్ లుక్ లో హన్సిక అదరహో అనే తరహాలోనే ఉంది. బారాత్ లో ఆమె డ్యాన్స్ చేస్తోన్న వీడియోను కూడా షేర్ చేసింది.