దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హన్సిక, ఆ సినిమా తర్వాత వరసగా తెలుగులో టాప్ హీరోస్ తో నటిస్తూ వచ్చింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఆమె కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ జూనియర్ కుష్బూ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య హన్సిక చాలా బరువు తగ్గింది. అప్పట్లో బొద్దుగా ఉండే హన్సిక ఇప్పుడు సన్నగా అయినప్పటికీ ఆమె అందం అసలు తగ్గలేదు అని తన సోషల్ మీడియాలో పెట్టె ఫొటోస్ ని చూసి చెప్పొచ్చు. ప్రస్తుతం తన ఇంట్లో ఫ్యామిలీతో ఉన్న హన్సిక ఒక ఫంక్షన్ కోసం దిగిన ఫొటోస్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. వైట్ చుడిదర్ లో హన్సిక చాలా అందంగా కనిపించింది. హన్సిక ని స్టైల్ గా బిగ్ బారో స్టూడియో వాళ్ళు తయారు చేశారు. తను వేసుకున్న జ్యూవెలరీని షీటల్ జేవీరి కంపెనీ డిజైన్ చేసింది. ఇక హీరోయిన్గా హన్సిక 50వ సినిమా మైలు రాయిని అందుకున్నారు. ఆమె 50వ సినిమా ఓ క్రేజీ లేడీ ఓరియంటెడ్ కథ. ‘మహా’ టైటిల్‌తో ఈ సినిమాకు యు.ఆర్ జమీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తి చేశారు.