పాల బుగ్గల సుందరి హన్సిక ఇటీవల సినిమాలలో తక్కువ కనిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్స్ గా హిందీ సినిమాల్లో పరిచయమైన హన్సిక ‘దేశముదురు’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించింది. ఇక ఆ తర్వాత నుండి తెలుగు, తమిళ సినిమాలను చేసినా క్రమంగా తన దృష్టిని తమిళ సినిమాలవైపే మళ్లించింది. అక్కడ వరసగా సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ ను అందుకుంది. హీరోలకు సమానమైన క్రేజ్ ను తెచ్చుకున్న హన్సిక ఇప్పుడు జోరును కొంచెం తగ్గించింది. గతేడాది తెలుగులో తెనాలి రామకృష్ణ సినిమాలో కనిపించిన హన్సిక, తమిళంలో ప్రస్తుతం ఒక సినిమాలోనే కనిపించనుంది. ఇకపై తన ఫోకస్ ను తిరిగి పూర్తిగా సినిమాల మీదే పెట్టాలని డిసైడ్ అయింది హన్సిక. అయితే హన్సిక లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్స్ ను చూస్తే ఆమె తనకు అత్యంత సన్నిహిత వ్యక్తుల పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేస్తోందన్న విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఇక నిన్న హన్సిక పెట్టిన పోస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. అసలే పాల బుగ్గల అందం, అందులోనూ గ్రే కలర్ లెహెంగాలో హన్సిక చూడముచ్చటగా ఉంది. ఆ నడుమందం చూపరులకు ఎర వేస్తోంది. ఇక ఆ వివాహ వేడుక పూర్తైనట్లుగా హన్సిక పోస్ట్ చూస్తే అర్ధమవుతుంది.