ఆయన సంగీత్ లో హన్సికదే హడావుడి..!

దేశముదురు సినిమాలో తన అందంతో, అభినయంతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన హన్సిక ఆ తర్వాత అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటనా రంగంలోకి వచ్చిన ఈ భామ పలు హిందీ సినిమాల్లో నటించింది. ఇక హీరోయిన్ గా సక్సస్ ట్రాక్ ఎక్కిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించింది. మలయాళంలో కూడా ఒక చిత్రం చేసి దక్షిణాదిన ఉన్న అన్ని భాషల్ని కవర్ చెసింది.

కేవలం వెండితెర మీదే కాకుండా యూట్యూబ్ లో కూడా అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. తన చానెల్ లో తనకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్యనే హన్సిక వాళ్ళ అన్న పెళ్ళి జరిగిన విషయం తెలిసిందే ఇక ఆ పెళ్ళికి సంబంధించిన వీడియోలని హన్సిక తన చానల్ లో షేర్ చేయనుంది. అయితే ముందుగా సంగీత్ ఫంక్షన్ రోజు తీసిన వీడియోని తన చానల్ లో షేర్ చేసింది హన్సిక. ఈ వీడియోలో సంగీత రోజు వాళ్ళు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తన కాస్ట్యూమ్ డిజైన్ చేసిన డిజైనర్ ని ఆమె పరిచయం చేసింది.

ఇక ఈ భామకు ఈ మధ్య సినిమా ఆఫర్లు తగ్గాయి. దీంతో సన్నబడటం ఒక్కటే దారి అనుకుని బొద్దుగా ఉన్న హన్సిక సడెన్ గా బరువు తగ్గి స్లిమ్ గా తయారైంది. ప్రస్తుతం హన్సిక ఫోటోలను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. దాదాపుగా 10 నుంచి 15 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే అప్పటివరకు హన్సికని బొద్దుగా చూసినటువంటి అభిమానులు ప్రస్తుతం బాగా సన్నగా బడడంతో పెద్దగా ఇష్టపడడం లేదు. ప్రస్తుతం ఆమె “మహ” అనే చిత్రంలో హీరోయిన్  గా నటిస్తోంది. ఈ చిత్రం హార్రర్ థిల్లర్ జాన్రాలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ చిత్రంతో ఈ భామ మునుపటి జోరును అందుకుంటుందేమో చూడాలి మరి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.