ఒకప్పటి తెలుగు బబ్లీ అంద్ క్యూట్ హిరోయిన్ జెనిలీయా. బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్ళి చేసుకున్నాక తెలుగు సినిమాకు దూరం అయ్యింది. జెనిలియా పేరు కంటే కూడా హాసిని పేరు తెలుగు వాళ్ళకి గుర్తుంటుంది. సిద్దార్థ్, జెనిలియా హీరో హీరోయిన్ లుగా వచ్చిన ‘బొమ్మరిల్లు’ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. కొడుకు గురించి అతిగా పట్టించుకునే తండ్రి, తండ్రి వైపు ప్రేమ, కోపం మధ్య నలిగే కొడుకు పడే ఘర్షణ నేపధ్యంలో కథ నడుస్తుంది. 2006 లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకి బాగా నచ్చింది. జెనిలియా ఈ సినిమా తర్వాత స్టార్ హిరోయిన్ గా ఎదిగింది. తన నటనకు ఎన్నో అభినందనలు, ప్రసశంలు వచ్చాయి. తెలుగులో హిట్టైన ఈ సినిమాను తమిళంలో పాటు బెంగాలి, ఒరియాలో రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్టైయింది. ఇక ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను బోనీ కపూర్ కొనుగోలు చేసాడు. అంతే కాదు హిందీలో నానా పాటేకర్, హర్మన్ బవేజా, జెనీలియాతో 'ఇట్స్ మై లైఫ్' పేరుతో అనీస్ బజ్మీ దర్శకత్వంలో రీమేక్ చేసారు. జెనిలియా తాజాగా రెడ్ డ్రెస్ లో ఉన్న ఫోటో ను ఇన్స్టా లో షేర్ చేసింది. నిజాయితీగా ఉండండి , ఫర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు అంటూ ఇమ్ స్టా లో చెప్పు కొచ్చింది.