
ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఉప్పెన తర్వాత ఆ లెవెల్లో హిట్ అయిన సినిమా జాతిరత్నాలు.. క్రాక్ సినిమా తో ఆఫ్టర్ కోవిడ్ టాలీవుడ్ మళ్ళీ తన సత్తాని చాటుకుంది.. దాన్ని కొనసాగిస్తూ ఉప్పెన సినిమా ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వలేదు . ఆ జోరును కొనసాగిస్తూ జాతిరత్నాలు సినిమాలు ఇప్పటికీ హౌస్ ఫుల్ అవుతూ వస్తుంది.. రిలీజ్ అయ్యి ఐదురోజులవుతున్నా జాతిరత్నాలు హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. నవీన్ పోలిశెట్టి క్రేజ్ కూడా ఓ రేంజ్ లో పెరిగింది.

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది.ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి11న విడుదలై సూపర్ టాక్ తెచ్చుకుంది.మొదటినుంచి ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేయడం, విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ కి రావడం ఇవన్నీ ఈ సినిమా కి మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి..ఉప్పెన, నాంది సినిమాల తర్వాత ఆ రేంజ్ లో టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే అంటే నమ్మాల్సిందే..

ఇక నవీన్ తో పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఫరియా అబ్దుల్లా కి కూడా మంచి పేరొచ్చింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల సమయంలో ఈవిడేంటి ఇంత పొడవుంది అని ప్రభాస్ చేసిన ఒక్క కామెంట్‌తో 'ఫరియా అబ్దుల్లా'కి ప్రేక్షకుల్లో యమ క్రేజ్ వచ్చింది. సినిమా విడుదలయ్యాక ప్రతి ఒక్కరి చూపు ఆమెపైనే పడింది. ఈ క్రమంలోనే ఫరియా అబ్దుల్లాకి మాస్ మహారాజా బంపర్ ఆఫర్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' మూవీ చేస్తున్న రవితేజ.. తన తర్వాతి సినిమాను త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లాని హీరోయిన్గా తీసుకుంటే బెటర్ అని దర్శకనిర్మాతలతో రవితేజ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.