
ఇండస్ట్రీ లక్ తో ముడిపడి ఉంటుంది. ట్యాలెంట్ ఉన్న వారికి లక్ ఉంటే ఎవరైనా సరే ప్రేక్షకుల్లో చాలా తొందరగా రిజిస్టర్ అవుతారు. లక్ బాలేకపోతే స్టార్ వారసులైనా ఇంటి ముఖం పట్టాల్సిందే. అలా అనతి కాలంలోనే స్టార్ హోదా సంపాదించుకున్న వారు చాలా మందే ఉన్నారు. అలా ఈ మధ్య కాలంలో తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది నటి ఫరియా అబ్దుల్లా. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రల్లో ఆమె హీరోయిన్గా నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్నిర్మించారు. మార్చ్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హౌస్ ఫుల్ షోస్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

జాతిరత్నాలు సినిమా సక్సెస్‌తో ఈ చిత్రంలో నటించిన అందరికి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రంతో కె.వి అనుదీప్ కూడా స్టార్ అయిపోయాడు. ఫరియా కూడా మొదటి సినిమాతోనే జనాల్లో రిజిస్టర్ అయ్యింది. తెలుగులోని బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి ఫరియాకు వరుస ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం కథలను వింటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నటి ఇప్పటివరకు మరో చిత్రానికి సంతకం చేయలేదని తెలుస్తోంది. జాతిరత్నాలు సినిమాలోని చిట్టి పాత్రతో కుర్రకారు మదిలో పత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి ఫరియా అబ్దుల్లా.