



తెలుగమ్మాయి ఈషా రెబ్బా కెరీర్ బిగినింగ్ లో చేసింది చిన్న చిత్రాలు అయినా, మంచి సినిమాలు చేశారు. అంతకు ముందు ఆ తర్వాత, అమీ తుమీ, అ! వంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఇక ఎన్టీఆర్ సరసన చేసిన అరవింద సమేత సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈషా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఈషా తన ఫోటో షూట్ ఫొటోస్ ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. ఇక ఇప్పుడు ఎరుపు రంగు దుస్తులతో అందంగా ఫొటోస్ కి ఈషా స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫొటోస్ లో ఆమె వేసుకున్న డ్రెస్ ని నల్లమాజ్ డిజైన్ చేశారు. ఈషా ని స్టైల్ గా అణహిత రెడి చేసింది. అలాగే జ్యూవెలరీ కీయరా జ్యూవెలరీ కంపెనీ తయారు చేశారు. ఈషా రెబ్బా ప్రస్తుతం మూడు చిత్రాలు చేస్తున్నారు. తెలుగులో అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మూవీలో ఈషా కీలక రోల్ చేస్తున్నారు. గతంలో అరవింద సమేత చిత్రంలో పూజా హెగ్డే చెల్లిగా ఈషా రెబ్బా నటించిన సంగతి తెలిసిందే. అలాగే జి వి ప్రకాష్ కుమార్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న ఆయిరం జన్మంగల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతోంది