తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన భూమిక చావ్లా తన పెళ్ళి తర్వాత సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ చేయడం ఆపేసింది. ఇక తన రిఎంట్రీ లో వదిన, అక్క క్యారెక్టర్స్ లో కూడా తన నటనతో మంచి పెరు తెచ్చుకుంది. అయితే భూమిక తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఇక భూమిక తన తల్లితో కలిసి కాశ్మీర్ లో దిగిన ఒక ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమూల్యమైన క్షణాలని పంచుకుంటున్నాం అని ఈ ఫోటోకి క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటోలో భూమిక అందమైన కొండల మధ్యలో చాలా ఆనందంగా కనిపించారు. ఇక భూమిక ప్రస్తుతం ‘ఇదే మా కథ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సుమంత్, భూమిక, శ్రీకాంత్, తాన్యా హోప్ పర్వతమార్గాల వెంబడి హెల్మెట్ పెట్టుకుని బుల్లెట్ పై వస్తున్న లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమౌతున్న ఈ చిత్రాన్ని గురుపవన్ డైరెక్ట్ చేస్తున్నాడు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయాలని మూవీ టీం ప్రయత్నిస్తున్నారు.