ఆమె జీవిత విషాదభరితం

సితారగా యువకుల మనసుల్లో చిరుదివ్వెలను వెలిగించిన తార, ఆకాశంలో ఆశల హరివిల్లు అంటూ తన నాట్యంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన నాట్య మయూరి భానుప్రియ. చిరంజీవి, బాలకృష్ణ, నాగర్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలందరితో నటించి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సితార సినిమాతో మొదలు పెట్టి తెలుగులో దాదాపు 150 సినిమాలు చేసారు. కేవలం 5 ఏళ్లలో 60 సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. రాజమండ్రిలో జన్మించిన ఆమె మొదటగా మెళ్ళపెసంగల్ అనే తమిళ సినిమాతో నటిగా అరంగేట్రం చేసారు. ఆమె నటించిన కొన్ని సినిమాలు అంతర్జీయ సినీ ఉత్సవాల్లో ప్రదర్శింపబడ్డాయి. దేశ వ్యాప్తంగా ఆమె అభిమానులను సంపాదించుకున్నారు. చిరంజీవి లాంటి డ్యాన్సర్ తో పోటి పడి స్టెప్స్ వేసే వారు ఆవిడ.

రీల్ లైఫ్ ని పెర్ఫెక్ట్ గా లీడ్ చేసిన ఆమె పర్సనల్ లైఫ్ ని మాత్రం సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయింది. సితార సినిమాతో ఆమెను తెలుగులో పరిచయం చేసిన వంశి గారితో ఆమె ప్రేమలో పడ్డారు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు కాని భానుప్రియ వాళ్ళ అమ్మగారు దానికి ఒప్పుకోలేదు. కారణం ఆయనకు అప్పటికే పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దవాళ్ళు ఒప్పుకోక పోవడంతో వీరు తమ ప్రేమను త్యాగం చేయక తప్పలేదు. వీళ్ళు విడిపోయాక వంశీ గారు చాలా కాలం సినిమాలు చేయలేదు. ఆయన కొంత కాలం డిప్రెషన్ లో ఉన్నారు.

ఆ తర్వాత ఆమె ఆదర్శ్ కౌశల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరి ప్రయాణం కొంతకాలం సజావుగానే సాగిన కొన్ని కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఛత్రపతి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు. అంతా బానే ఉంది అనుకున్న టైమ్ లో ఆయన మరణించారు. ఆయన మరణం నుండి కోలుకున్న ఆమెకు వెంటనే మరొక షాక్ ఆవిడ తల్లి కూడా మరణించారు. వాళ్ళ అమ్మగారు కూడా చనిపోవడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళారు. ఒకప్పుడు స్టార్ హీరొయిన్ గా వెలుగొందిన ఆమె ఇప్పుడు ఇలా అవ్వడం చాలా బాధాకరం.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.