
సాధారణంగా నిర్మాతలు సినిమాలపై హైప్ క్రియేట్ అవ్వడానికి ప్రీ-రిలీజ్ ఈవెంట్లు చేస్తుంటారు. అభిమానులు తమ అభిమాన తారల్ని చూడటానికి ఖచ్చితంగా వస్తారు. వారి కోసమే చిత్ర బృందాలు చాలా ఎరెంజ్మెంట్స్ చేస్తారు. తమ అభిమాన హీరో గాని, హీరోయిన్ గాని వారి కళ్ళ ముందు కనబడితే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. ఎన్నో సినిమా ఫంక్షన్స్ లో అభిమానులు హీరోలతో ఫోటోలు దిగడానికి, వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి బౌన్సర్ల కళ్ళుగప్పి వారి వద్దకు పరిగెత్తుకుంటూ వస్తుంటారు. సెలబ్రిటీలు కూడా తమ ఎంతగా అసహనానికి గురిచేసిన కేవలం అభిమానుల కోసమే ఎంతో ఓపిగ్గా ఉంటారు.

కార్తీ, రష్మిక మండన్న జంటగా నటించిన చిత్రం సుల్తాన్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు చిత్ర బృందం. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి, పైగా రష్మిక ఇప్పుడు నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాద్ షా తో కలిసి ఆమె టాప్ టక్కర్ అనే ప్రైవేట్ ఆల్బమ్ పాటను చేసారు, అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడుగా తెరకెక్కుతున్న మిషన్ మంజు అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇటీవలే సుల్తాన్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా అయ్యింది. ఈ ఈవెంట్ లో నటీ నటులు కార్తీ, రష్మిక మండన్నలతో పాటు ముఖ్య అతిధిగా దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పాల్గొన్నారు.

మిషన్ మంజు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా సుల్తాన్ ప్రమోషన్స్ ని మాత్రం ఆమె వదలడం లేదు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ రోజు కూడా షూటింగ్ ను త్వరగా ముగించుకుని మరీ ఈవంట్ కి వచ్చారు. అంత బిజీగా ఉన్నా ఆమె వచ్చింది మాత్రం ఫ్యాన్స్ కోసమే. స్టేజ్ పై ఉన్నంత సేపు ఫ్యాన్స్ తోనే ఎక్కువగా మాట్లాడారు. మాస్క్ లు పెట్టుకోలేదని, సోషల్ డిస్టెన్స్ లేదు అని ఫ్యాన్స్ ని ముద్దుగా కొప్పాడ్డారు. సూర్య...సూర్య అంటూ ఫ్యాన్స్ ఎంత గోల చేసినా వాళ్ళతో పాటు ఆమె కూడా అల్లరి చేసి చివరికి వాళ్ళని బుజ్జగించి ఆ తర్వాత ఆమె మాట్లాడాలి అనుకున్నది మాట్లాడారు. ఫ్యాన్స్ అంటే రష్మికకి ఎంత ఇష్టమో ఈ ఈవెంట్ చూస్తే అర్థమౌతోంది.