అనుపమ తను చేయబోయే కొత్త మళయాళ చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి ప్రేమమ్ సినిమా మళయాళం లో హిట్ అవ్వడం తో ఈ కేరళ కుట్టికి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ లో అవకాశం వచ్చింది. ‘అ ఆ’ సినిమాలో గడుసు పిల్లగా నటించి, తన నటనతో అందరి హృదయాలు కొల్లగొట్టింది. తర్వాత మన తెలుగు హీరోల సరసన చేస్తూనే వుంది. అనుపమ పరమెశ్వరన్ ఏదోక ఫోటోతో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు తన డబ్ స్మాష్ లతో క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అనుపమ ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టింది. తన ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. తాజాగా మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ సొంత బాషలో ‘ఫ్రీడం @ మిడ్ నైట్’ చిత్రం రాబోతంది. ఈ చిత్రానికి సంబందించిన సినిమా పోస్టర్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా విడుదల చేసంది. పచ్చటి చీర కట్టు ఎర్రటి బొట్టు తో ఉన్న అనుపమ పోస్టర్ దీవాళికి విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆర్ జె షాన్ దర్శకత్వం వహిస్తున్నాడు.