అనుపమ హర్ట్.. బుమ్రా పెళ్లి తర్వాత సంచలన నిర్ణయం..?

అనుపమ పరమేశ్వరన్.. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయకపోయినప్పటికీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రజల నోళ్ళల్లో నానుతూ ఉంటుంది..ఇటీవలే ఆమె నటించిన ఓ షార్ట్ ఫిలిం కూడా యూట్యూబ్ లో తెగ హిట్ అయిపోవడంతో అనుపమ ఇప్పుడు నేలమీద లేదు.. ఈ దెబ్బతో అయినా ఆమెకు తెలుగు లోసినిమా అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారు. నితిన్ హీరో గా నటించిన 'అ ఆ' సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది.

తొలి సినిమా తో హిట్ కొట్టడమే కాకుండా ఆ పాత్ర లో నటనతో అందరిని మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ప్రేమమ్ తో హిట్ కొట్టి వెంటనే శతమానం భవతి సినిమా తో హిట్ కొట్టి టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్ లు కొట్టిన హీరోయిన్ గా అవతరించింది. అయితే ఈ సక్సెస్ ని ఆమె కంటిన్యూ చేయలేకపోయింది..ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ - స్క్రీన్ ప్లే అందిస్తున్న '18 పేజెస్' సినిమా  లో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది.. నిఖిల్ కథానాయకుడు..

ఇక గత కొన్ని నెలలుగా టాలీవుడ్ బ్యూటీ అనుమప పరమేశ్వరన్, యువ క్రికెటర్ బుమ్రా ల మధ్య ఎఫైర్ ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్, స్పోర్ట్స్‌ ప్రెజెంటర్‌ సంజన గణేశన్‌‌ని బుమ్రా పెళ్లాడారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతవరకూ బాగానే ఉన్నా బుమ్రా పెళ్లి జరిగిన మరుసటి రోజే హీరోయిన్ అనుమప పరమేశ్వరన్ ఇలా విరహ గీతం పాడి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయడం కొత్త చర్చలకు తెరలేపింది. ఇప్పటికిప్పుడు బుమ్రా పెళ్లి కాగానే ఇలా విరహ గీతం పాడాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పుకుంటున్నారు జనం.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.