హమ్మయ్య నా వల్ల వెస్ట్ కాలేదు అంటున్న అనుపమ

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మలయాళ ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అ… ఆ సినిమాతో టాలీవుడ్‌‌కు ఎంట్రీ ఇచ్చిన అనుపమ ఆ వెంటనే శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురూ ప్రేమకోసమే వంటి హిట్ సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. అయితే అనుపమ తన అభిమానులకి సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ లోనే ఉంటుంది. ఇక అనుపమ అప్పుడే 2020 అయిపోయింది అని ఒక ఫన్నీ పోస్ట్ పెట్టింది. అందులో అరె 2020 అంత వేస్ట్ అయిపోయిందే అని ఒక స్టిల్, అది కరోన వలన అని ఇంకో స్టిల్, హమ్మయ్య ఈసారి నా వల్ల వేస్ట్ కాలేదు లే అని స్టిల్స్ తో ఫొటోస్ పెట్టింది. ఈ పోస్ట్ కి అనుపమ ఫాలోవర్స్ ఫన్నీ కామెంట్స్ పెట్టారు. ఇక అనుపమ ప్రస్తుతం నిఖిల్ తో కలిసి ‘18 పేజిస్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి కథని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అందిస్తున్నారు. ఈ సినిమాని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో కుమారి 21ఎఫ్ సినిమాతో సూర్య ప్రతాప్ ఫేమ్ ను సంపాదించుకున్నాడు. బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సుకుమార్ ఈ సినిమాను సమర్పిస్తున్నాడు. ఒక విభిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.