గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటిన అనుపమ

ప్రస్తుతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని సెలెబ్రిటీస్ అందరూ స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే ఈ ఛాలెంజ్ లో రాశి ఖన్నా, కేథరిన్, రామ్ చరణ్ లాంటి సెలెబ్రిటీస్ పాల్గొనగా ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు బాచుపల్లిలో అనుపమ పరమేశ్వరన్ మొక్కలు నాటింది. హీరో నిఖిల్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటనని అనుపమ పరమేశ్వరన్ తన పోస్ట్ ద్వారా తెలిపింది. తన మొక్కలు నాటే ఫొటోస్ ని అనుపమ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ఇక అనుపమ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని తన తోటి నటులు అమిటాష్ పార్ధన్, నివేథా థామస్, సాయి పల్లవి లకు మొక్కలు నాటమని అనుపమ ఛాలెంజ్ చేసింది. ఇక ఈ మొక్కలు నాటే  కార్యక్రమంలో మమత హాస్పిటల్ ఎం.డి డా. పువ్వాడ నయన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణనికి, మనకి చాలా మంచి జరుతుంది అని అందరూ ఈ హరా హై తో బరా హై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని పాటించి అందరి ఇళ్ళలో మొక్కలు నాటాలని అనుపమ  అన్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.