



అనుపమ పరమేశ్వరన్ పేరు వినగానే చేప పిల్లలాంటి ఆమె కళ్ళు గుర్తొస్తాయి. అవి చెప్పే కొంటె కబుర్లు వినిపిస్తాయి. ‘అ...ఆ!’ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఈ అమ్మాయి, తొలి ప్రయత్నంలోనే శభాష్ అనిపించుకుంది. ప్రేమమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది. శర్వానంద్ కి జోడిగా నటించిన శతమానం భవతి చిత్రంలో అనుపమ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తార్వత హిరో రామ్ తో కూడా రెండు సినిమాల్లో నటించింది. దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్న ఆశిష్ రెడ్డికి జోడీగా ఆమె 'రౌడీ బాయ్స్' చేయనుంది. 'హుషారు' దర్శకుడు శ్రీహర్ష ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. మలయాళం నుంచి రానున్న ఒక తెలుగు రీమేక్ లోను ఆమె నటించనుంది. ఇలా మూడు ప్రాజెక్టులతో కొత్త ఏడాదిలో అనుపమ పరమేశ్వరన్ జోరు కొనసాగనుందనే తెలుస్తోంది. ఈ భామ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా వుంటోంది. తన సినిమాలకి సంబంధించిన విషయాలు, తన ఫ్యాషన్, పోటోషూట్స్ అన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అనుపమ కొత్త పోట షూట్ చేసింది. దానికి సంబంధించి ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో అనుపమ జ్యూవెలరీస్ తో ఒల్డ్ ట్రెడిషన్ కట్టు, బొట్టుతో స్టన్నింగ్ లుక్ లో వుంది.