
టాలీవుడ్ కి ‘అ.ఆ’ సినిమాతో పరిచయమై తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి అనుపమ పరిమేశ్వరన్. ఆమె సినిమాల్లో ఎంత బిజీగా ఉంటుందో అలాగే సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటది. ఇక ఈ మధ్యనే వచ్చిన తన రింగుల జుట్టుతో ఫొటోస్ ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటది. అయితే ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ లో తన రింగుల జుట్టుతో అందంగా నడుస్తూ ఒక వీడియోని పోస్ట్ చేసారు. ఈ వీడియోలో ఆమె రింగుల జుట్టు ఎగురుతూ చూడటానికి చాలా బాగుంది. ఇక అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం హీరో నిఖిల్ సరసన '18పేజీస్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లొనే అనుపమ ఈ వీడియోని తీశారు. ఈ మధ్యనే ఈ సినిమా మొదలై షూటింగ్ శరవేగంగా నడుస్తుంది. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథని అందిస్తున్నారు. అలాగే అనుపమ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తుంది. ‘ఫ్రీడమ్ యట్ మిడ్ నైట్’ పేరుతో వస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ త్వరలోనే విడుదల కాబోతుంది.