మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అనుపమ ఆ వెంటనే శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురూ ప్రేమకోసమే వంటి హిట్ సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. అయితే అనుపమ తన అభిమానులకి సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ లోనే ఉంటుంది. ఇక అనుపమ రెడ్ శారీతో ఉన్న ఫోటో తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ చీరలో అనుపమ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఫోటోకి జస్ట్ చిల్లింగ్ ఔట్ అని అనుపమ క్యాప్షన్ పెట్టింది. ఇక అనుపమ ప్రస్తుతం నిఖిల్ తో కలిసి 18 పేజిస్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి కథ ప్రముఖ దర్శకుడు సుకుమార్ అందిస్తున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో కుమారి 21ఎఫ్
సినిమాతో సూర్య ప్రతాప్ గుర్తింపు సంపాదించుకున్నాడు. బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సుకుమార్ ఈ సినిమాను సమర్పిస్తున్నాడు. ఒక విభిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.