

పేరుకే అనుపమ పరమేశ్వరన్ మలయాళ భామ. ప్రేమమ్ సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది అనుపమ. అదే సినిమా తెలుగు రీమేక్ తో ఇక్కడా అడుగుపెట్టింది. వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం లభించింది. ఇక అక్కడి నుండి ఈ భామ వెనుతిరిగి చూసింది లేదు. వరసగా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే రీసెంట్ గా కొంచెం డౌన్ అయినట్లు కనిపించిన అనుపమ మళ్ళీ తిరిగి తన ఫోకస్ ను తెలుగు ఇండస్ట్రీపై ఉంచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మలయాళ ముద్దు గుమ్మ తెలుగు నేర్చుకుంటోంది. అంటే పలకడం కాదు. ఇప్పటికే తెలుగు మాట్లాడడం అనుపమకు బాగానే వచ్చు. అయితే ఈ అమ్మడు తెలుగు రాయడం నేర్చుకుంటోంది. "అ తో మొదలుపెడుతున్నా. నా కొత్త గోల్. ఈ క్యూట్ బుక్ ను అందించినందుకు గోపి గారు మీకు ధన్యవాదాలు" అని అనుపమ పోస్ట్ పెట్టింది. పోస్ట్ చేసిన ఫొటోలో ఈ భామ అ అక్షరాన్ని దిద్దుతూ కనిపించింది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘18 పేజెస్’ సినిమాను చేస్తోంది అనుపమ.