అనసూయ సొగసు చూడ తరమా

బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా రాణిస్తున్న అనసూయ ఈ మధ్య సినిమాల మీద దృష్టి పెట్టింది. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. తన యాంకరింగ్ తో తోటి యాంకర్లకు గట్టి పోటి ఇస్తుంది ఆనసూయ. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అసలు ఆమె ఇంత బాగా నటించగలదా అనేలా ఆమె బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను అందించింది. ఈ చిత్రంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. వచ్చిన సినిమాల్లో మంచి కథలను ఎంచుకుంటూ వైవిధ్యతను చాటుకోవాలని ఆమె ప్రయత్నిస్తోంది.


ప్రస్తుతం ఆమె నటిస్తున్న థాంక్ యూ బ్రదర్ సినిమా విన్నూత్నంగా సాగే కథ అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అప్పట్లో విడుదలైన పోస్టర్ కి ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. షార్ట్ ఫిలిమ్స్ లో హీరోగా నటించిన అశ్విన్ విరాజ్ ఇందులో మేల్ లీడ్ లో నటించనున్నారు.


ఈ చిత్రంతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో ఒక ముఖ్యపాత్రలో కనిపించనుంది. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఖిలాడి చిత్రంలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనుంది. ఈ చిత్రం కోసం ఇటలీ వెళ్ళిన అనసూయ నీలి ఆస్మా అనే పాటను స్లోమోషన్ లో ప్లే చేస్తూ దారి వెంట వయ్యారంగా నడుస్తూ ఆ వీడియోను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో పోస్ట్ చేసిన దగ్గర నుండి ఆమె అభిమానులు లైకుల వర్షం కురిపిస్తూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.