తెలుగులో రామ్ చరణ్ తో కలిసి నాయక్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది అమలపాల్. ఆ తర్వాత రఘువరన్ బీటెక్ డబ్బింగ్ సినిమాలో కనిపించి తన అందంతో అందరిని అలరించింది. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీ ఉన్న అమలాపాల్ తన సోషల్ మీడియా ద్వారా తన ఆలోచనల్ని తన అభిమానులతో పంచుకుంటుంది. ఇక అమలాపాల్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా 2020 కి గుడ్ బై చెప్తూ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ డ్రెస్ లో స్టైల్ గా ఫోటోని పోస్ట్ చేసింది. ఇక ఈ ఫోటోని ప్రముఖ ఫోటోగ్రాఫర్ అజిష్ ప్రేమ్ తీశారు. 2021 సంవత్సరాన్ని క్యాండీ కలర్ గ్లాస్సెస్ లో చూస్తున్న అని ఆమె ఈ ఫోటోకి క్యాప్షన్ పెట్టారు. ఇక అమలాపాల్ తమిళంలో నటించిన ఆడై సినిమాతో సంచలనం సృష్టించారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం వెబ్ సిరీస్ లో కూడా అమలా నటించబోతుంది. మహేష్ భట్, జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న ఓ హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. దీని తర్వాత ఆహాలో త్వరలోనే ఒక కొత్త కంటెంట్ ఒక సిరీస్ ని అమలాపాల్ చేయబోతోంది. ప్రస్తుతం అంతా ఓ.టి.టి క్రేజ్ నడుస్తుండటంతో అమలా ఈ వెబ్ సిరీస్ లతో ఎంతమేరకు సక్సస్ అవుతుందో చూడాలి.