అదితి రావు హైదరి చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకుల్లో మాత్రం ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నది. ఏది పడితే అది చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ కెరియర్ లో దూసుకుపోతుంది ఈ అమ్మడు. ఇప్పటి వరకు చేసిన పాత్రలు నటనకు ప్రాధాన్యం ఉన్నవె కావడం గమనార్హం. దీంతో నటన పరంగా పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ అదితి రావు హైదర్ ఈ ఇప్పటి వరకు తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాలని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించింది. అదితిరావు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యాషన్, గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఫ్యాషన్ షూట్ కి సంబంధింఛిన ఒక ఫోటోని ఇషాన్ గిర్రి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ ఫోటోలో కలర్ ఫుల్ ఫ్యాషన్ డ్రెస్స్ లో మంచి జ్యువెలరీస్ తో స్టన్నింగ్ లుక్ లో ఉంది అదితిరావు హైదరి. ఈ ఫోటోకి వీపరీతమైన లైక్స్ వచ్చాయ్.