సమ్మోహనం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అదితి రావు. అప్పటికే హిందీలో వరసగా సినిమాలు చేసి తనను తాను ప్రూవ్ చేసుకుంది. సమ్మోహనం మంచి విజయం సాధించడంతో పాటు అదితి రావుకు నటిగా చాలా మంచి పేరొచ్చింది. ఇక ఆ తర్వాత సమ్మోహనం తెరకెక్కించిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలోనే వి చిత్రాన్ని కూడా చేసింది. మధ్యలో చేసిన అంతరిక్షం పెద్ద ప్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం అదితి హిందీ, తమిళ్, తెలుగు సినిమాలతో చాలా బిజీగా ఉంది. తమిళ్ లో హే సినామిక అనే చిత్రాన్ని చేస్తోంది. హిందీలో రెండు సినిమాల్లో కనిపించనుంది. అలాగే తెలుగులో మహా సముద్రం చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. ఆరెక్స్ 100 చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. అలాగే అదితి రావు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ప్రస్తుతం తన ఫ్యామిలీతో, స్నేహితులతో బెస్ట్ టైంను ఎంజాయ్ చేస్తోంది. "డిసెంబర్ లో ఎప్పుడూ కడుల్'o క్లాక్" అంటూ అదితి రావు పోస్ట్ పెట్టింది.