అదితి రావు హైదరి మణిరత్నం 'చెలియా' సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. అయితే
ఆమె తెలుగులో నేరుగా చేసిన చిత్రం 'సమ్మోహనం'. ఈ సినిమాకి మోహన కృష్ఱ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అదితి రావు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ సినిమా తరువాత వరసగా ఆమె తెలుగులో పాత్రకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. అయితే అదితి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక క్యూట్ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అదితి తన కుక్క పిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా కనిపించింది. తన రెండు కుక్క పిల్లలు అదితి మీద పడి ఆడుకోవడం చూసి తన అభిమానులు క్యూట్ గా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అదితి రావు హైదరి ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె చేస్తున్న మహా సముద్రం సినిమా షూటింగ్ కూడా ఈ మధ్యనే మొదలైంది. ఈ సినిమాలో అదితి శర్వానంద్ కి జోడిగా కనిపించబోతుంది. అలాగే ఈ సినిమాలో చాలా సంవత్సరాల తర్వాత సిద్ధార్ధ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని ఆర్ ఎక్స్ 100
సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.