అదితికి పెళ్ళయి విడాకులు కూడానా!

తన నటనతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసే నటి అదితి రావు హైదరి. ప్రజాపతి అనే మలయాళ చిత్రం ద్వారా 2006లోనే నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత మర్డర్-3, రాక్ స్టార్ లాంటి పలు హిందీ చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2017లో మణిరత్నం దర్శకత్వంలో కార్తి హీరోగా వచ్చిన తమిళ్ సినిమా చెలియాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఆ సినిమాతో ఇక్కడ కూడా మంచి గుర్తింపుని ఏర్పరచుకోవటమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం సినిమాతో తెలుగులోనూ తన మార్కెట్ ను ఏర్పరచుకుంది.

ఇప్పుడు ఆమె తెలుగులో బిజీ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం శర్వానంద్ కి జోడిగా మహాసముద్రం సినిమాలో నటిస్తోంది. టాలివుడ్ తో పాటు బాలివుడ్ లో కూడా ఆమెకు స్టార్ స్టేటస్ ఉంది. ఎంత స్టార్ స్టేటస్ ఉన్నా ఆమె చాలా సాదా సీదాగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా చాలా సింపుల్ గా ఉంటారు. చాలా మందికి తెలియని విషయమేంటి అంటే ఆమె రాజుల కుటుంబానికి వారసురాలు. తండ్రి ఈషాన్ హైదరి, తల్లి విద్య రావు ఇద్దరూ రాజ కుటుంబికులే అంతే కాకుండా అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు అదితికి కజిన్ అవుతుంది.

అదితి వాళ్ళ అమ్మగారు బాలివుడ్ లో ప్రముఖ సింగర్. అదితికి రెండేళ్ళ వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. ఆమె ఆరేళ్ళ వయసు నుండే భారతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులోనే సత్యదీప్ మిశ్ర అనే వ్యక్తితో ప్రేమలో పడి 21వ సంవత్సరంలో ఆమె ఆయన్ని పెళ్ళి చేసుకుని కొన్నేళ్ళకి ఆయనతో విడిపోయారు. ఆయనతో విడిపోయినా ప్రస్తుతం ఇద్దరూ మంచి స్నేహితులుగానే మెలుగుతున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.