హార్ట్ అటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అదా శర్మ. అయితే త్వరగానే క్యారెక్టర్ రోల్స్ లోకి జంప్ అయింది. అదా శర్మ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తదితర చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. ఆఖరుగా ఆమె తెలుగులో చేసిన సినిమా కల్కి. దాని తర్వాత పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టి సారించింది అదా శర్మ. ఆమె కమాండో సిరీస్ ద్వారా ఫేమ్ ను సంపాదించింది. కమాండో 2, కమాండో 3 చిత్రాల్లో భావన రెడ్డి పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సిరీస్ లో హీరోతో సమానంగా ఆమె ఫైట్స్ లో పాల్గొనడం విశేషం. ఇక ప్రస్తుతం కమాండో 4 షూటింగ్ జరుగుతోంది. అయితే మరి అదా శర్మ సరదాగా పెట్టిందో లేక నిజంగానే పెట్టిందో తెలీదు కానీ "కమాండో 5 కోసం నేను, విద్యుత్ జంవాల్ ప్రిపేర్ అవుతున్నాం. కమాండో 5 ఎక్స్ క్లూజివ్ లీక్డ్. విద్యుత్ జంవాల్ బికినీ పిక్స్ కోసం మాత్రం చిత్ర నిర్మాత ఆశిన్ షా ను అడగండి" అని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.