ఐస్ క్రీం కావాలంటే అతన్ని కలవండి అంటున్న అదా శర్మ

హార్ట్ అటాక్ బ్యూటీ అదా శర్మ గుర్తుందిగా. తన క్యూట్ లుక్స్ తో డెబ్యూ సినిమాలోనే అదరగొట్టిన అదా శర్మ ఆ తర్వాత ఎందుకో క్యారెక్టర్ పాత్రలకు కూడా మొగ్గు చూపింది. అప్పటినుండి అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోన్న అదా రీసెంట్ గా ఒక కవర్ సాంగ్ తో దుమ్ము దులిపింది. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. కేవలం తన గ్లామరస్ ఫొటోలతోనే కాక చిత్ర విచిత్రమైన ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోయర్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. రీసెంట్ గా అదా శర్మ చేసిన ఒక పోస్ట్ హైలైట్ అవుతోంది. రోడ్ సైడ్ స్టాల్ దగ్గర ఐస్ క్రీమ్ తిని ఆ బండి ఓనర్ పేరును అడిగి తెలుసుకున్న ఆదా శర్మ వీడియో వైరల్ అయింది. ఆ పోస్ట్ కు అదా ఐస్ క్రీమ్ కావాలంటే రామేశ్వర్ ను కలవండి అని షేర్ చేసింది. అన్నట్టు ఈ అమ్మడు లాక్ డౌన్ సమయం నుండి విచిత్రమైన మాస్కులతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ ఫోటోలు, వీడియోలు ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్నాయి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.