
అమితాబ్ బచ్చన్ కి నాగార్జునకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పలిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో కమర్షియల్స్ లో నటించారు. నాగార్జున గారికి అమితాబ్ ఫ్యామిలితో విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన మాట మీదే అక్కినేని మూడు తరాల హీరోలు నటించిన మనం సినిమాలో అతిధి పాత్రలో నటించారు. ఆ సినిమా నట సామ్రాట్ నాగేశ్వరరావు గారి ఆఖరి చిత్రం అన్న విషయం తెలిసిందే.
అమితాబ్ తో కలిసి ఆయన నటించిన కళ్యాణ్ జ్యువెలరీ కమర్షియల్ యాడ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ యాడ్ తో వీళ్ళిద్దరూ తరచూ కలుస్తుంటారు కూడా. అయితే ఇటీవలే కళ్యాణ్ జ్యువెలర్స్ కి సంబంధించి ఒక కొత్త యాడ్ వచ్చింది. ఇందులో నాగర్జున, అమితాబ్, జయ బచ్చన్ లతో పాటు రెజినా కూడా నటించింది. నాగార్జున చెల్లెలిగా ఆమె ఇందులో నటించింది. అల్లారుముద్దుగా పెంచిన చెల్లెలిని అత్తవారి ఇంటికి పపించేటప్పుడు అన్న మనసు ఎంత బాధ పడుతుందో ఇందులో చూపించారు.
ఈ పాటని ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించారు. ఆయన గాత్రంతో ఈ పాటకు సగం ప్రాణం పోశారు. ఈ యాడ్ కళ్యాణ్ జ్యువెలర్స్ కి ఎంతవరకూ ఉపయోగపడుతుందో తెలీదు కాని చూడటానికి మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి మరి.