
జీవితంలో మనం ఎంత ఎదిగినా మన అనే వాళ్ళు మనతో లేకపోతే ఉండే బాధ మాటల్లో చెప్పలేనిది. ఏ రంగంలోనైన ఇది సహజమే ఇందుకు సినీ పరిశ్రమ అతీతం కాదు. సెలబ్రిటి స్టేటస్ ను ఎంజాయ్ చేస్తూ తమకు ప్రియమైన వారు తమతో లేరని నిత్యం బాధపడే వాళ్ళు చాలామందే ఉన్నారు ఇండస్ట్రీలో. తమ తోడబుట్టిన వారిని పోగొట్టుకున్న ముఖ్యమైన నటులు వీరు.
ఎన్.టి.ఆర్ – జానకిరామ్

నందమూరి వారసుడిగా తెరంగేట్రం చేసినా ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకొని తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు ఎన్.టి.ఆర్. మొదట్లో నందమూరి ఫ్యామిలి ఆయన్ను పక్కన పెట్టేసినా జానకిరామ్ మాత్రం ఎన్.టి.ఆర్ ను చాల ప్రేమగా చూసుకునే వారు. ఎన్.టి.ఆర్ కుటుంబంతో కలపాలని అనుకునేవారు అయన. ఆయన మరణించే టైమ్ కి జూనియర్ వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. టెంపర్ తో సరైన హిట్ పడే టైమ్ కి ఆయన స్వర్గస్తులయ్యారు. అప్పటి వరకూ సక్సస్ ని అన్నయ్యతో షేర్ చేసుకువాలి అనుకున్న ఎన్.టి.ఆర్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఇప్పటికీ అయన లేని లోటు తీర్చలేనిదని బాధపడుతుంటారు.
రవితేజ – భరత్

ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సైడ్ క్యారెక్టర్లతో తన ప్రయాణం మొదలుపెట్టి స్టార్ హీరోగా ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు రవితేజ. అయన తమ్ముడు భరత్ కూడా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగారు. ఎన్నో సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు. ముఖ్యంగా విలన్ పాత్రల్లో చాలా బాగా నటించారు. అనుకోకుండా ఒక రోజు అయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆఫ్ స్క్రీన్ పై కూడా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే ఆయన ఆయన తమ్ముడు మరణించిన తర్వాత కొద్దిగా డల్ అయ్యారు.
గోపీచంద్ – ప్రేమ్ చంద్

దిగ్గజ దర్శకుడు టి.కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గోపీచంద్ మొదట విలన్ గా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. గోపీచంద్ హీరోగా చేస్తున్న సమయంలో వాళ్ళ అన్నయ్య ఒక సినిమాకి దర్శకుడిగా చేస్తున్నారు. అప్పుడే రోడ్డు ప్రమాదంలో అయన మరణించారు. హీరోగా ఇంత మార్కెట్ ఏర్పరచుకున్న తనకు నాన్న, అన్నయ్య లేని లోటు ఎప్పుడూ ఉంటుందని ఆయన అంటుంటారు.