
యంగ్ హీరో విశ్వక్ సేన్, నివేద పేతురేజ్, సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ హీరో హీరోయిన్లుగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం `పాగల్`. ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది, ఈ సందర్బంగా సోమవారం హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్ నివేద పేతురేజ్ మాట్లాడుతూ ..చాలా ఆనందంగా ఉంది .. ఈ సినిమా విజయం. ఇది ఎమోషనల్ జర్నీ మాకు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మేము పెట్టిన ఎఫర్ట్ కు మంచి ఫలితం వచ్చింది. ఏ సినిమా విషయంలో అయినా టీం సపోర్ట్ ఉంటె తప్పకుండా అది మరో రేంజ్ సినిమా అవుతుంది. ఆలా మా టీం ఇచ్చిన సపోర్ట్ తో అందరం ఎఫర్ట్ పెట్టి సినిమా తీసాం. కరోనా సమయంలో ఎన్నో కష్టాలకు తట్టుకుని ఈ సినిమా చేసాం. తప్పకుండా మా మంచి ప్రయత్నాన్ని అందరు ఆదరించారు. మా హీరో విశ్వక్ సేన్ ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుని అన్ని దగ్గరుండి చూసుకున్నారు. అతనికి సినిమా అంటే ఇష్టం. విశ్వక్ ఎఫర్ట్ గురించి ఎంత చెప్పిన తక్కువే. మరో సారి అతను ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నారు అన్నారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. “అందరికి థాంక్స్ చెప్పాలి. లాస్ట్ మండే సినిమా ఎలారా బాబు సినిమాను జనాల దగ్గరికి తీసుకెళ్లాలి అనుకున్నాం. ఎలాగైనా సరే సినిమాను థియటర్స్ లో చూడాలన్నది నా కోరిక. కరోనా కారణంగా రెండు నెలలు థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. మన సినిమా మనమే ప్రమోట్ చేసుకోవాలని చాలా కష్టపడి సినిమాను విడుదల అనుకున్న సమయానికి తెచ్చాము. ఈ సినిమా హిట్ తో నా నమ్మకం నిజమైంది, నా నమ్మకం వమ్ము కాదని మ రోసారి ప్రూవ్ చేసారు ప్రేక్షకులు. ఇప్పుడు నేను పెరుమార్చుకోవలసిన అవసరం లేదు . నేను హీరోగా చేసిన హిట్ సినిమా 'హిట్' కలెక్షన్స్ కంటే పాగల్ కలక్షన్స్ 40% ఎక్కువ వచ్చాయి. నాకు, ఆడియన్స్ కి మధ్యలో ఎవరు లేరు. ఈ సినిమాతో నాకు ఆడియెన్స్ తప్ప ఎవరూ లేరని అర్థం అయింది” అని అన్నారు.