పెళ్ళి చూపులు సినిమాతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా విజయ్ దేవరకొండ టాక్సీ వాలా, గీత గోవిందం లాంటి సినిమాలు సూపర్ హిట్ అవడంతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. విజయ్ కి సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ ఉంది. ఆయనకి ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే విజయ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెంచ్ ఫుడ్ తింటూ ఒక ఫోటో పెట్టారు. ఆహారం తనని ఆనందంగా ఉంచుతుంది అని ఆయన క్యాప్షన్ పెట్టి ఈ ఫోటోని పంచుకున్నారు. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఫైటర్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో వస్తోంది. ఈ సినిమాను హీరోయిన్ ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ, అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్లో భాగంగా ముంబైలో 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది.