Victory #Venkatesh Thrills everyone with his New Uber Cool Stylish Look @VenkyMama pic.twitter.com/ayh3YXNcCP
— BARaju (@baraju_SuperHit) December 12, 2020
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన మార్క్ చూపిస్తూ విభిన్నమైన సినిమాలతో దూసుకుపోతున్నారు దగ్గుబాటి వెంకటేష్ గారు ఇప్పుడు న్యూ లుక్‌లో ఫోటో షూట్లో పాల్గొని ఆ ఫోటోలని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ఆదివారం 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా వెంకటేష్ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ ఫొటోలలో విక్టరీ వెంకటేష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో నెరిసిన గడ్డంతో స్టైలిష్ డ్రెస్‌కి తగ్గట్టు బ్లాక్ గాగుల్స్ ధరించి వెంకటేష్ కనిపిస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా వుంటే విక్టరీ వెంకటేష్ నటిస్తున్న`నారప్ప` మూవీ నుంచి ఈ రోజు రాత్రి 8 గంటలకు టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ మూవీ తమిళ్ లో ధనుష్ నటించిన సూపర్ హిట్ చిత్రం `అసురన్` ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అంచనాల్ని పెంచేసింది. కరోన లాక్డౌన్ తర్వాత మొదలైన ఈ సినిమా షూటింగ్ శర వేగంగా నడుస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయాలి అని మూవీ టీం భావిస్తున్నారు.