
తెలుగు హీరోల్లో ఎవరికీ ఇలాంటి ఓపెనింగ్ వచ్చి ఉండదేమో. ఇంతకు ముందెన్నడూ ఏ హీరోకి మొదటి సినిమాకి రాని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు వైష్ణవ తేజ్. మెగా ఫ్యామిలి నుండి వచ్చినప్పటికీ మొదటి సినిమాకే తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. మెగా హీరోల్లో ఎవరు కూడా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోలేదు. అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్, వరుణ్ అందరి మొదటి సినిమాలు యావరేజ్ సినిమాలే. ఆ తర్వాత చేసిన చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యి వారికంటూ ప్రత్యేకించి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.
బుచ్చి బాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. విజయ్ సేతుపతి, సాయి చంద్ లు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం విడుదలైన 3 రోజుల్లోనే దాదాపుగా 30 కోట్ల షేర్ ను వసూలు చేసింది. విడుదలైన అన్ని సెంటర్లలో మంచి టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఒక డెబ్యూ హీరో మూవీ ఇంత హిట్ అవ్వడం ఈ మధ్య కాలంలో జరగలేదు. ఇప్పుడున్న హీరోల్లో కూడా ఎవరి మొదటి సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వలేదు. తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన ‘జయం’ చిత్రం ఇలాంటి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. నితిన్ ను మినహాయిస్తే ఎవరికీ మొదటి సినిమాతో ఈ రేంజ్ హిట్ రాలేదనే చెప్పొచ్చు. ఈ చిత్రంలో వైష్ణవ్ కూడా తన లుక్స్ తో మెస్మరైజ్ చేసాడు. ఇలాంటి లైన్ తో ముందుకు వెళ్ళడమే అతను సక్సెస్ అయ్యాడు. ఆ పాత్ర కోసం అతను తనను తాను మౌల్డ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో తను చేసిన ఆశి పాత్రలో ఇమిడిపోయి మనల్ని కూడా తను ఆశినే అన్నట్టుగా మైమరచిపోయేలా చేసాడు. తన వేషధారణ, మాట్లాడే విధానం, హావాభావాలు అన్ని ఒక నిజమైన జాలరి లానే మనకు అనిపిస్తుంది. ఇలానే తన తదుపరి సినిమాల్లో కూడా తన నటనతో అందరినీ మెప్పిస్తాడో లేదో చూడాలి మరి.