Hero @RAHULorTYSON new film launched with pooja formalities.@ChetanAhimsa plays another main lead.
— BARaju (@baraju_SuperHit) December 2, 2020
Music director #SaiKarthik turns producer with this crime thriller to be directed by debutant #ViratChakravarthy.@SakshiCh2017 #Aishwarya #Amyaela #SSStudios #VisionCinemas pic.twitter.com/Vx5BUo3NH8
శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమాలో టైసన్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ తర్వాత చాలా తక్కువ సినిమాలలో కనిపించారు. ఆయన హీరో గా నటించిన వెంకటాపురం సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. ఇక ఇప్పుడు రాహుల్ కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాని శ్రీమతి దివిజా సమర్పణలో యస్.యస్ స్టూడియోస్ & విజన్ సినిమాస్ పతాకం పై రాహుల్, చేతన్, సాక్షి చౌదరి, ఐశ్వర్య, యమీ నటీనటులుగా విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో సాయి కార్తీక్,నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్న థ్రిల్లర్, కామెడీ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఫోటోలని ప్రముఖ పి ఆర్ ఓ బి ఎ రాజు గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన మధుర శ్రీధర్ పూజ కార్యక్రమాలు మొదలుపెట్టగా చిత్ర నిర్మాతలలో ఒకరైన సాయి కార్తీక్ క్లాప్ కొట్టగా, నాగం తిరుపతి రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు, చిత్ర సహ నిర్మాత శ్రీకాంత్ దీపాల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ పూజ జరిగాక ఈ సినిమాలో టెక్నిషన్స్ అందరూ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. అలాగే డి.ఓ.పి గా మార్గల్ పనిచేస్తున్నారు. ఇక ఎడిటింగ్ విభాగాన్ని నాగేశ్వర్ రెడ్డి చూసుకుంటున్నారు.