INTRIGUING and INTERESTING poster of #Pareshan #Pareshanfirstlook
— Ram Gopal Varma (@RGVzoomin) December 12, 2020
All the best to writer/director @rupakronaldson and his team @PavaniKaranam1 @iamThiruveeR@imvishwadev@BunnyAbiran @saipras1nna @vincentpraveen#Siddarth Rallapalli pic.twitter.com/aO2TwHHzQR
భారీ బడ్జెట్ సినిమాల్ని పక్కన పెట్టి వరసగా చిన్న సినిమాలని తీస్తున్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిన్న సినిమాల్ని ప్రోత్సహించడంలో కూడా ముందు ఉంటారు. ఇక ఇప్పుడు తెలుగులో కొత్తగా రాబోతున్న పరేషాన్ సినిమా ఫస్ట్ లుక్ ని రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేసారు. ఈ పరేషాన్ సినిమా ఫస్ట్ లుక్ చూడటానికి కొత్తగా ఉంది. ఒక మేకకి మందు పోస్తూ ఫస్ట్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. జార్జ్ రెడ్డి, పలాస 1978, ఆహాలో వచ్చిన సిన్ సినిమాల్లో తన నటనతో మంచి పేరు తెచ్చుకున్న తిరువీర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా పావని కరణం నటిస్తున్నారు. కొబ్బరి మట్టా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రూపక్ రోనాల్ద్సన్ ఈ సినిమాకి కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పరేషాన్ సినిమాని సిద్ధార్ధ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. చిన్న చిన్న సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న చాలా మంది నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో కొత్త కాన్సెప్ట్ సినిమాలకి మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే.