హీరో అవడంకోసం ఐదేళ్లు తిరిగా చివరికి నన్ను.. తేజ.!!

జాంబీ రెడ్డి సినిమా తో హీరోగా పరిచయమయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్ తేజ.. పెద్దపెద్ద సినిమాలలో హీరో పాత్రలకు చిన్నప్పటి పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ. దాదాపు యాభై సినిమాలకు పైగా నటించిన తేజ అయన చేసిన సినిమాల్లో ఇంద్ర, ఆది సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.. ఆ తర్వాత చదువు కోసం సినిమాలకు దూరంగా ఉన్న తేజ ఇటీవలే హీరోగా జాంబీ రెడ్డి సినిమా చేశాడు. ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో సినిమా రావడం మొదటి సారి కాగా సినిమా కి వెరైటీ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించడంతో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి..

అ!, కల్కి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ చేసిన మూడో సినిమాగా  ఈ సినిమా చేయగా వెరైటీ కాన్సెప్ట్ గా సినిమా మంచి మార్కులు కొట్టేయగా కమర్షియల్ గా సినిమా హిట్ అవ్వలేదు. కామెడీ పరంగా మంచి మార్కులు కొట్టేసింది.. ఇక హీరోగా డెబ్యూ చేసిన తేజ కి మంచి మార్కులే పడ్డాయి.. ఆల్రెడీ కెమెరా ముందు చేసిన అనుభవం ఉండడంతో ఆయనకు మెగా హీరోల సపోర్ట్ కూడా ఉండడంతో సినిమా కి మంచి పబ్లిసిటీ వచ్చింది.

తాజగా తేజ తనకు కూడా ఇండస్ట్రీ లో కొన్ని కష్టాలు తప్పలేదు అని చెప్తున్నాడు. పెద్దయ్యాక హీరోగా స్థిరపడటం అనుకున్నంత సులువు కాదని చెబుతున్నాడు తేజ. దాదాపు అయిదేళ్లు అవకాశాల కోసం విశ్వప్రయత్నాలు చేశాడట. కొన్ని సినిమాల్లో సెలెక్ట్‌ అయ్యి అంతా ఓకే అనుకున్న సమయంలో ప్రాజెక్టు నిలిచిపోయేదట. ఇలా చాలా సినిమాలకు జరిగిందట. మరికొందరేమో ‘సారీ తేజా’ అంటూ మరొకరిని తమ సినిమా కోసం ఎంపిక చేసేవారట. ఇలా చాలా అవకాశాల్ని పోగొట్టుకున్నాకే ‘జాంబీ రెడ్డి’తో హీరో అయ్యాడట తేజ. ఈ క్రమంలో తన తొలి చిత్రం ‘చూడాలని ఉంది’ రోజుల్ని కూడా తేజ గుర్తు చేసుకున్నాడు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.