సోనూ సూద్ ను సన్మానించిన సీనియర్ నటుడు తనికెళ్ళ

కరోనా లాక్డౌన్ వల్ల చాలామంది పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలిసిందే. తినడానికి తిండి లేక ఎక్కడో ఊరికి దూరంగా ఇరుక్కుని పోయినా చాలా మంది కూలీలా బాధలు మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో చాలా మంది వాళ్ళకి తగినంతలో సహాయం చేసారు అలాంటి వాళ్లలో సినీ నటుడు సోను సూద్ ఒకరు. కరోన వలన కష్టాల్లో పడిన చాలామంది పేద ప్రజలకి సోను సూద్ సహాయం చేసి ఆదుకున్నారు. ఈ మంచి పనుల వలన సోను సూద్ మంచితనం ఏంటో అందరికి తెలిసింది. అయితే ప్రస్తుతం సోను సూద్ ఆచార్య సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఆయన కరోన లాక్డౌన్ సమయంలో చేసిన మంచి పనులకి ఆచార్య సినిమా డైరెక్టర్ శివ కొరటాల, నటుడు తనికెళ్ళ భరణి గారు సోను సూద్ ని ఈ సినిమా షూటింగ్ లో సత్కరించారు. మన మధ్యనే ఉంటూ కరోన కష్ట సమయంలో వందల మందికి ఉపకారం చేసిన సోనూసూద్ గారికి అభినందనలు అని తనికెళ్ళ భరణి గారు అన్నారు. ఇక ఆచార్య సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలై శరవేగంగా నడుస్తుంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.