అప్పుడు టెక్సాస్ లో ఆయిల్ రిగ్ లో పనిచేసా : సుశాంత్

యువ నటుడు సుశాంత్ గురించి పరిచయం అవసరం లేదు. కాళిదాసు సినిమాతో తెరంగేట్రం చేసాడు. రెండో సినిమా కరెంట్ తో డీసెంట్ హిట్ కొట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఆయన దాదాపు 4 సంవత్సరాలు సినిమాలు చేయలేదు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చి.ల.సౌ చక్కటి విజయం సాధించింది. వైవిధ్యమైన కథనంతో సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువైంది. ఈ చిత్రంతో చక్కటి నటనను కనబరిచారు సుశాంత్.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుశాంత్ తన ఇంస్టాగ్రం అకౌంట్ లో ఒక ఫోటోను షేర్ చేసారు. ఆ ఫోటో ఆయనది అనుకునేరు. అది ఒక జాకెట్ ఫోటో. ఆయన టెక్సాస్ లో ఉన్నప్పుడు ష్లంబర్గర్ ఆయిల్ రిగ్ లో పని చేసానని, అప్పటి డ్రెస్ కోడ్ ఈ జాకెట్ అని, కొన్ని నెలలు మాత్రమే అక్కడ పని చేశా కాని అప్పటి కాలేజ్ ఎక్స్పీరియెన్స్ మర్చిపోలేనిది. అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక ప్రస్తుతం సుశాంత్ ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సిఇనిమలో నటించారు. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ మంచి స్పందనను తెచ్చుకుంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైనా కరోన కారణంగా వాయిదా పడాల్సి వచ్చింది. ఇక ఆయన తదుపరి సినిమాల గురించి ఎలాంటి సమాచారమూ లేదు. జెనరల్ గా సినిమాలు చాలా స్లోగా చేసే సుశాంత్, సినిమా సినిమాకి చాలా గ్యాప్ ఉంటుంది. మరి ఈ సారి ఆయన తదుపరి చిత్రానికి ఎంత గ్యాప్ ఉంటుందో వేచి చూడాలి మరి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.