అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ఒక స్థాయిని తెచ్చుకున్న నటుడు సుశాంత్ . ‘చి ల సౌ’ సినిమాతో ఆయన నటుడిగా మంచి మార్కులు కొట్టేసాడు. ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతున్న ఇచట వాహనాలు నిలపరాదు సినిమాకి ఎస్.దర్శన్ దర్శకత్వం వహిస్తుండగా, రవిశంకర్ శాస్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సుశాంత్ ప్రొవోక్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాగజైన్ లో తన ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని విషయాలని ఒక చిన్న వీడియో ద్వారా సుశాంత్ ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి తన సినిమా కెరీర్ గురించి ఆయన మనకు తెలియని విషయాలని పంచుకున్నారు. ఇక సుశాంత్ ప్రస్తుతం నటిస్తున్న ఇచట వాహనాలు నిలపరాదు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మీనాక్షీ చౌదరి ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమవుతోంది. ఈ సినిమాలో వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, రవివర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలకి రెడి అవబోతుంది. కొత్త కాన్సెప్ట్స్ ని ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఏ రేంజ్ లో హిట్ చేస్తారో చూడాలి.