
అక్కినేని నాగ చైతన్యకి హిరో సుశాంత్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోను హిరో సుశాంత్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి బర్త్ డే విషెస్ చెప్పాడు. సుశాంత్ ఈ పోస్ట్ పెడుతూ “హ్యాపీ బర్త్ డే బ్రదర్ నువ్వు లైఫ్ ని బాలెన్స్ చేసే విధానం, నీ కెరీర్ ని నువ్వు మలచుకున్న తీరు ఇవన్నీ చాలా అమెజింగ్ గా ఉంటాయి, ఇలానే నువ్వు నీ పుట్టిన రోజుని సంతోషంగా ప్రతీ సంవంత్సరం జరుపుకోవాలి” అంటూ చెప్పుకొచ్చాడు. నాగ చైతన్య ప్రస్తుతం తన భార్య సమంతతో కలిసి మల్దీవుల పర్యటన ని ఎంజాయ్ చేస్తున్నాడు. నాగ చైతన్య శేఖర్ ఖమ్ముల దర్శకత్వం లో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చె సంవత్సరం విడుదలకు ఉంది. ఈ సినిమా లో నాగ చైతన్య కి జోడిగా ఫిదా ఫేమ్ సాయి పల్లవి నటిస్తుంది. అలాగే సుశాంత్ కూడా చి.ల.సౌ సినిమాతో హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం సుశాంత్ హిరో గా నటిస్తున్న చిత్రం ఇక్కడ వాహనములు నిలుపరాదు. నో పార్కింగ్ అనేది ఈ సినిమా టైటిల్ ట్యాగ్ లైన్ . ఈ సినిమా టైటిల్ తోనే అందరి లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమా టీజర్ లో సుశాంత్ అదరగొట్టాడు