Found this nostalgic container filled with VHS tapes of films produced by grandfather, AV Subba Rao garu, under Prasad Art Pictures banner.
— Sushanth A (@iamSushanthA) November 30, 2020
Illarikam being the first special film!#ANRLivesOn #PAP 🙏 pic.twitter.com/zL6gaJIcA0
'చిలాసౌ' తో హిట్ కొట్టి అల వైకుంఠపురం సినిమాలో కీ రోల్ లో నటించి ఇప్పుడు ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే భిన్నమైన టైటిల్ తో వస్తున్నారు నటుడు సుశాంత్. అక్కినేని ఫ్యామీలి నుండి వచ్చిన ఈ నటుడు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు ప్రేక్షకులను పలకరిస్తుంటారు. కాళిదాసు సినిమాతో ఆరంగ్రేటం చేసిన తర్వాఅ కరెంట్ అనే హిట్ సినిమాలో నటించారు.తర్వాత సుమారు నాలుగేళ్ళూ గ్యాప్ తీసుకుని అడ్డా సినిమాతో రీ ఎంట్రీ ఘనంగా ఇచ్చారు.తర్వాత ఆటాడుకుందాంరా సినిమాలో నటించిన అది ఆంత మంచి పేరు తీసుకురాలేకపోయింది. కాని 2018 లో మరోనటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిలసౌ అనే సినిమాలో మంచి నటన కనబరిచి ప్రేక్షకుల మనన్నలు పొందారు. ఆ సినిమా హిట్ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో అనే సినిమలో ముఖ్యమైన పాత్రలలో నటించి తన సత్తా చాటారు.
సుశాంత్ తన ట్విట్టర్ ఖాతాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన ఫ్రెండ్స్ అయిన ఇతర నటుల సినిమాల గురించి. తమ కజిన్స్ అయిన అక్కినేని అఖిల్, అక్కినేని నాగచైతన్య సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. తనకు నచ్చిన సినిమాలు, విషయాల గురించి తన అభిమానలతో తరుచూ ముచ్చటిస్తుంటారు. రీసెంట్ గా ఇల్లరికం, నవరాత్రి, తల్లిదండ్రలు, అర్దాంగి వంటి పాత తెలుగు సినిమాల విహెచ్ ఎస్ క్యాసెట్లను ఫోటోలు తీసి వాటిని ట్విట్టర్ లో అప్లోడ్ చేసి “ మా తాత గారు ఎ వి సుబ్బారావ్ గారు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించినిన కొన్ని క్లాసిక్ సినిమాల విహెచ్ ఎస్ క్యాసెట్ల బాక్స్ దొరికింది. పాత జ్ఞాపకాలు మళ్ళీ తిరిగివస్తున్నాయి. ఇందులో ఇల్లరికం నాకు ఫస్ట్ స్పెషల్ ఫిల్మ్” అని పోస్ట్ చేశారు.