హీరోగా సోనుసూద్..? రేమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

కరోన వల్ల దానిని నివారించడానికి పెట్టిన లాక్డౌన్ వల్ల దేశం అంత అతలాకుతలం అయింది. చాలా మంది జీవితాలని కరోన కష్టాల్లోకి నెట్టింది. అయితే ఇలాంటి సమయంలొనే కొంతమంది వ్యక్తుల వల్ల చాలా మందికి సహాయం అందింది. అలాంటి వాళ్లలో మనకి ముందుగా గుర్తొచ్చేది సోను సూద్ పేరు. ఆయన చాలా మంది వలస కూలీలను వాళ్ల ఇళ్ళకి చేర్చారు. దాదాపు 20 వేల మంది వలస కార్మికులను సోను సూద్ తన సొంత ఖర్చుతో ట్రైన్స్, బస్సులు, ఫ్లైట్స్‌లో సొంతూళ్లకు పంపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి.

కరోనా నేపథ్యంలో ప్రజలకు సోనూసూద్ అందిస్తున్న సేవలు ఎవరూ చేయలేరు. ఆపదలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేసారు. వారందరి దృష్టిలో ఇప్పుడు ఆయన నిజమైన హీరో. ఈ విషయంలో దేశం మొత్తం సోనూసూద్‌ను కొనియాడుతూనే ఉంది. మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో మళ్ళీ ఈ మహమ్మారి పంజా విసురుతున్న నేపథ్యంలో ఆయన తిరిగి తన సేవలు మొదలు పెట్టారు. డైరెక్ట్‌గా, సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటూ అనేకమందికి సాయం చేస్తున్నాడు. రెమిడిసివిర్, ఆక్సీజన్, మెడికల్ ఎక్విప్ మెంట్స్ ఇలా ఎన్నింటిలో అందిస్తూ వైద్యులకు కూడా సాయంగా ఉంటున్నాడు.

ఇదిలా ఉంటె ప్రస్తుతం ఆయనకు జనాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఎంతగా అంటే ఏకంగా ఆయన్ను హీరోగా పెట్టి సినిమా తీసిన బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేంతగా. ఇప్పటికే ఆయనకు హీరోగా కూడా చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే తానూ విలన్ గ మాత్రమే చేస్తానని వచ్చిన ఆఫర్లని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఇక రెమ్యునరేషన్ కూడా భారిగా పెంచేసినట్లు సమాచారం. ఒక సినిమాకి కోటి రూపాయలకు పైగా ఆయనకు ఆఫర్ చేస్తున్నారట నిర్మాతలు. అయితే ఆయన చేస్తున్న సేవల ముందు ఇది ఏమాత్రమూ సరిపోదని కొంతమంది ఆయనా మీదున్న అభిమానంతో అంటున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.