ఆపద్భాందవుడిని కూడా వదల్లేదుగా!

కరోన వికృత రూపాన్ని దాల్చింది. ఎక్కడ చూసినా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీలు కూడా కరోన భారిన పడుతున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కరోన భారిన పడ్డారు. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని ట్రీట్మెంట్ కి ఆయన బాగా రెస్పాండ్ అవుతున్నారని డాక్టర్ లు చెప్పారు. అయితే ఇప్పుడు మరో నటుడు కరోన భారిన పడ్డారు. లాక్ డౌన్ లో ఎంతోమందిని ఆదుకున్న ఆపద్భాందవుడు సోనూ సూద్ కి కరోన సోకింది.

నిన్న ఉదయం అయన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియజేశారు. “అందరికీ నమస్కారం నాకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అవసరమైన జాగ్రత్తలను పాటిస్తున్నాను. కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు మీ గురించి ఆలోచించడానికి నాకు తగు సమయం దొరికింది, ఎల్లప్పుడూ మీ క్షేమాన్ని కోరుకుంటూ మీ సోనూసూద్” అంటూ ఒక లెటర్ ను పోస్ట్ చేసారు. ఆయనకు పాజిటివ్ అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. సాధారణంగా ఆయాన ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. ఆయనకు కూడా కరోన సోకడంతో ఇప్పుడు అందరూ అప్రమత్తం అవుతున్నారు. ఆ మహమ్మారి నుండి ఆయన సత్వరమే కోలుకోవాలని కోరుకుందాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.